Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిన్న చిన్న లోపాలున్నా... హిట్ టాక్ తెచ్చుకున్న 'రంగస్థలం'!

  • సెకండాఫ్ లో కొన్ని చిన్న లోపాలు
  • సినిమా చాలా బాగుందంటున్న అభిమానులు
  • మూడు రోజుల పాటు థియేటర్లన్నీ ఫుల్!
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నిర్మితమై నేడు విడుదలైన 'రంగస్థలం' హిట్ టాక్ ను తెచ్చుకున్నట్టు సమాచారం. ఈ సినిమా చూసిన వారు రామ్ చరణ్ అద్భుతంగా నటించాడని, సినిమా బాగుందని చెబుతున్నారు. తొలి సగభాగానికి పూర్తి మార్కులు వేస్తున్న ప్రేక్షకులు, రెండో భాగంలోమాత్రం సెంటిమెంట్ సీన్లు సుదీర్ఘంగా సాగాయని అంటున్నారు. సమంత, జగపతిబాబులు, ఆది పినిశెట్టి బాగా నటించగా, రంగమ్మత్త పాత్ర ఓ సర్ ప్రైజ్ గా ఉంటుందని అంటున్నారు.

1980వ దశకం నాటి వాతావరణాన్ని సృష్టించడంలో దర్శకుడు, చిత్ర టీమ్ పడిన శ్రమ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపించిందని ట్వీట్లు చేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, చంద్రబోస్ లిరిక్స్, పాటలు కూడా బాగున్నాయని చెబుతున్నారు. రత్నవేలు చాలా హార్డ్ వర్క్ చేసినట్టు కనిపించిందని కితాబిస్తున్నారు. ఇక హైదరాబాద్ లోని పలు థియేటర్ల వద్ద అభిమానుల సందడి అంతాఇంతా కాదు. నగరంలోని 150 స్క్రీన్లలో చిత్రం ప్రదర్శితమవుతుండగా, శుక్రవారంతో పాటు శని, ఆది వారాల్లోనూ దాదాపు సీట్లన్నీ ఫుల్ అయినట్టు టికెట్ బుకింగ్ వెబ్ సైట్స్ చూపిస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
Rangasthalam
Ramcharan
Hyderabad
Movie

More Telugu News